Tuesday, September 22, 2015

Monday, September 14, 2015

ఇంటర్వ్యూ విత్ కాజల్ అగర్వాల్ చారిత్రక సినిమా చేయాలని వుంది!

చారిత్రక సినిమా చేయాలని వుంది! 


తెలుగు చిత్రసీమకు నేనెప్పుడూ దూరం కాలేదు. అనుకోకుండా ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నాను అని చెప్పింది కాజల్ అగర్వాల్. ఆమె కథానాయికగా నటించిన తమిళ అనువాద చిత్రం జయసూర్య ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా ముచ్చటించింది కాజల్ అగర్వాల్. ఈ సొగసరి చెప్పిన సంగతులివి...

ఈ ప్రపంచంలో మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు కాబట్టి మనసును ఉల్లాస పరిచే పనుల్నే చేయండి. ప్రియమైన వారి సమక్షంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఒకరిపట్ల వున్న ప్రేమను వారికి తెలియజెప్పండి. అప్పుడే జీవితం ఆనందంగా వుంటుంది.
జయసూర్య చిత్రంలో తొలిసారి విశాల్‌తో కలిసి నటించడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
వృత్తిపట్ల అంకితభావం కలిగిన వ్యక్తి విశాల్. నటనలో పర్‌ఫెక్షన్ కోసం తపిస్తారాయన. సెట్స్‌లో అందరితో వినయంగా వుంటారు. ఆయనతో కలిసి నటించడం ఆనందంగా అనిపించింది.

సినిమాలో మీరు చేసిన పాత్రకు ఎలాంటి స్పందన లభిస్తోంది?
ఈ సినిమాలో నా పాత్రపేరు సౌమ్య. చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ప్రతి విషయంలో అతిగా భయపడే యువతిగా కనిపిస్తాను. ట్రాఫిక్‌లో రోడ్డు దాటాలన్నా భయమే. దెయ్యాలుభూతాలున్నాయేమోనని భయపడుతుంటాను. ఆమె జీవితాన్ని ఓ సంఘటన మలుపు తిప్పుతుంది. అదేమిటో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. అభినయప్రధానంగా సాగే నా పాత్ర సినిమాలో చాలా కీలకంగా వుంటుంది.

నిజ జీవితంలో మీకు ఏమైనా భయాలున్నాయా?
రియల్‌లైఫ్‌లో నేను చాలా ధైర్యంగా వుంటాను. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్ని అయినా ఎదుర్కొనడానికి సిద్ధంగా వుంటాను.
గత కొంతకాలంగా తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారుతెలుగులో అవకాశాలు తగ్గిపోవడంవల్లనే మిళందృష్టిపెడుతున్నారా?


అలాంటిదేమీ లేదు. గతంలో మాదిరిగానే తెలుగులో నాకు మంచి అవకాశాలొస్తున్నాయి. రెండేళ్ల కిత్రం తెలుగులో బిజీగా వున్నాను. అప్పుడు తమిళ మీడియా వారు ఇదే ప్రశ్న అడిగారు. ఇప్పుడు నటిస్తున్న తమిళ చిత్రాల్ని రెండేళ్ల క్రితమే అంగీకరించాను. అవి వరుసగా సెట్స్‌మీదకు రావడంతో తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నాననే ఫీలింగ్ కలుగుతోంది. తెలుగు పరిశ్రమకు నేనెప్పుడూ దూరం కాలేదు. ప్రస్తుతం బ్రహ్మోత్సవం సర్దార్ గబ్బర్‌సింగ్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాను.

గతంతో పోల్చితే తెలుగులో కాజల్ హవా తగ్గిందని అంటున్నారు?
ఆ మాటల్ని నేను ఒప్పుకోను. టెంపర్ తర్వాత తెలుగు సినిమాలకు సంవత్సరం గ్యాప్ వచ్చింది. అది ఎవరికైనా సహజమే. ఒక్క సంవత్సరంలో పది సినిమాలు చేయలేం కదానచ్చిన కథల కోసం వెయిట్ చేసే క్రమంలో గ్యాప్ రావడం సహజం. దాన్ని పరిగణనలోకి తీసుకొని తెలుగులో నా ప్రాభవం తగ్గిందనడం కరెక్ట్ కాదు. 

చిత్ర సీమలో కథానాయికలపై గాసిప్స్ ఎక్కువగా వస్తుంటాయి. వాటిని మీరు ఎలా స్వీకరిస్తారు?


నేను వివాదాలకు దూరంగా వుంటాను. నాపనేదో నేను చేసుకుపోతాను. షూటింగ్‌కు ప్యాకప్ చెప్పిన తర్వాత సినిమాల గురించి అస్సలు ఆలోచించను. సాయంత్రం ఆరుదాటిందంటే కుటుంబ సభ్యులుమిత్రులతో కలిసి నాదైన వ్యక్తిగత జీవితాన్ని గడుపుతాను. ఇక నాపై వచ్చే గాసిప్స్ గురించి ఏ మాత్రం పట్టించుకోను. నేనేమిటో నా కుటుంబ సభ్యులకు తెలుసు. కాబట్టి ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. 

తెలుగుతమిళహిందీ...మూడు భాషల్లో బిజీగా వున్నారు. షూటింగ్స్ మధ్య ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారు?


కెరీర్ ఆరంభం నుంచి మూడు భాషలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తున్నాను. ముందస్తు ప్రణాళిక ప్రకారమే డేట్స్ ఇస్తాను కాబట్టి షూటింగ్ విషయంలో ఎప్పుడు ఇబ్బందులు తలెత్తలేదు. వృత్తిపరంగా అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఎదురైనా అవి వెంటనే సమసిపోతాయి.

రాజమౌళి దర్శకత్వంలో నటించిన మగధీర మీ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ మధ్యన విడుదలైన బాహుబలి చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాలో మీకు అవకాశం వస్తే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా?


రాజమౌళిగారి సినిమాల్లో నటించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆయనొక లివింగ్ లెజెండ్. మగధీర చిత్రం ద్వారా నాకు రాజమౌళిగారితో పనిచేసే అదృష్టం దక్కింది. భవిష్యత్తులో ఆయన సినిమాలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.

సినిమాలపరంగా జయాపజయాల్ని ఎలా స్వీకరిస్తారు?


పరిశ్రమలో ప్రతి శుక్రవారం ఫలితాలు తారుమారవుతుంటాయి.. సక్సెస్ వస్తే హ్యాపీగా ఫీలవుతాను. ఫెయిల్యూర్ వస్తే దాన్ని వెంటనే మర్చిపోయి తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తాను. సినిమా అనేది టీమ్‌వర్క్. ఇక్కడ జయాపజయాలు ఏ ఒక్కరి చేతులో వుండవు. కాబట్టి వాటి గురించి ఎక్కువగా ఆలోచించను. అయితే నటనాపరంగా ఎక్కడైనా తప్పుచేశానని భావిస్తే దాన్ని తర్వాతి సినిమాలో సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను.
నంబర్‌వన్ స్థానంపై మీ అభిప్రాయమేమిటిమీ సమకాలీన కథానాయికల మధ్య ఎలాంటి పోటీ వుందనుకుంటున్నారు?
నంబర్‌స్థానం గురించి ఆస్సలు పట్టించుకోను. మనసుకు నచ్చిన మంచి సినిమాలు చేయడం గురించే ఆలోచిస్తాను. మిగతా హీరోయిన్స్‌తో నాకు చక్కటి స్నేహసంబంధాలున్నాయి. నేను ఎవరినీ పోటీగా భావించను. వారి విజయాల్ని కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాను.

డ్రీమ్స్ రోల్స్ ఏమైనా వున్నాయా?
యాక్షన్ సినిమాతో పాటు ఫుల్‌లెంగ్త్ కామెడీ సినిమా చేయాలని వుంది. వీటితో పాటు ఓ చారిత్రక చిత్రంలో నటించాలన్నదే నా డ్రీమ్.
ప్రస్తుతం అగ్ర కథానాయికలు చాలా మంది మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తున్నారు. మీరు మాత్రం పూర్తిగా కమర్షియల్ సినిమాల్నే చేస్తున్నారెందుకని?
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని నాకూ వుంది. అయితే కథలు నచ్చక కొన్ని సినిమాల్ని వద్దనుకున్నాను. మంచి కాన్సెప్ట్‌తో ఎవరైనా ముందుకు వస్తే మహిళా ప్రధాన చిత్రంలో నటిస్తాను. అలాంటి సినిమాల్లో పాత్రపరంగా ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించడానికి సిద్ధంగా వున్నాను.

ఇంతకి పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే పరిశ్రమకు దూరమవుతారా?
ఇప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించలేదు. ప్రస్తుతం కెరీర్ మీదనే దృష్టి పెడుతున్నాను. జరగాల్సిన టైమ్‌లో పెళ్లి తప్పకుండా జరుగుతుంది. పెళ్లయ్యాక కూడా సినిమాల్లో కొనసాగుతాను.
మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎలా వుండాలనుకుంటున్నారు?
ఉన్నత విద్యావంతుడై వుండాలి. ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా జీవితాన్ని గడపగలగాలి. ప్రతి విషయంలో ఆశావహ దృక్పథాన్ని కలిగివుండాలి. అన్నింటికంటే ముఖ్యంగా చక్కటి హాస్య చతురత కలిగివుండాలి.

సహజీవనంపై మీ అభిప్రాయమేమిటి?సహజీవనమనేది వ్యక్తిగత విషయం. ఇద్దరి మధ్య నిజమైన ప్రేమచక్కటి అవగాహన వుంటే కలిసి వుండటంలో తప్పేమి లేదనుకుంటాను. సహజీవనం సంప్రదాయానికి వ్యతిరేకం కాదు. అయితే నేను మాత్రం పెళ్లయ్యేంత వరకు నా తల్లిదండ్రులతోనే కలిసి వుండాలనుకుంటున్నాను. 

సినిమాలు కాకుండా మీ వ్యక్తిగత ఇష్టాలేమిటి?
నేను పుస్తకాలు బాగా చదువుతాను. అమీష్ త్రిపాఠిఆయాన్‌ర్యాండ్జాయ్‌దత్తా నా అభిమాన రచయితలు. ప్రపంచ యాత్రలన్నా నాకు ఇష్టమే. అమెరికాతో పాటు యూరప్దక్షిణాసియాలోని అందమైన ప్రదేశాల్ని సందర్శించడాన్ని ఇష్టపడతాను. ముఖ్యంగా బీచ్‌ల్లో విహరించడమంటే చాలా ఇష్టం.

పదేళ్ల కెరీర్‌ను విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది. ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడైనా ఊహించారా?
సినీరంగమే కాదు..నేను ఏ రంగాన్ని ఎంచుకున్నా ఉన్నత స్థానానికి చేరుకోవాలని ముందే నిర్ణయించుకున్నాను. నా ఆత్మవిశ్వాసం అలాంటిది. అయితే మంచి అవకాశాలతో పాటు ప్రేక్షకుల ఆదరణతో ఈ స్థాయికి చేరుకున్నానని భావిస్తున్నాను.

సమంత శృతిల గురించి మహేష్

సమంత శృతిల గురించి మహేష్
మొన్నటిదాకా సమంత పేరు వినిపించగానే మహేష్ బాబు అభిమానులు ఒక రకంగా రెస్పాండ్ అయ్యేవారు. ఆమెని ఓ శత్రువుగా ట్రీట్ చేసేవాళ్లు. `1` (నేనొక్కడినే) పోస్టర్ పై సమంత కామెంట్ చేయడమే అందుకు కారణం. అయితే తన అభిమానులకీ - సమంతకీ మధ్య పోస్టర్ కామెంట్ పై  ఆన్ లైన్ లో జరిగిన వార్ గురించి తెలుసుకొన్న మహేష్ అప్పట్లో  స్వయంగా రంగంలోకి దిగాడు. కూల్ గా స్పందించి పరిస్థితిని ఒక్కసారిగా ప్రశాంతంగా మార్చేశారు. అంతటితో ఆగకుండా ఇటీవల తన `బ్రహ్మోత్సవం`లోనూ సమంతకి ఛాన్సిచ్చేశాడు. మహేషే ఇలా మనసులో ఏమీ పెట్టుకోకుండా సమంతని ఎంకరేజ్ చేస్తుండటంతో ఆయన అభిమానులు కూడా దిగొచ్చారు. ఇప్పుడు సమంత అంటే మా హీరోయిన్నే అన్నట్టుగా చూస్తున్నారంతా. మహేష్ తాజాగా ఇచ్చిన స్టేట్ మెంట్ కూడా సమంత మన  హీరోయిన్నే అన్న సంకేతాన్ని ఆయన అభిమానుల్లోకి పంపింది. 

మామూలుగా మీకు ఇష్టమైన హీరోయిన్ గురించి చెప్పమంటే మహేష్ ఎప్పుడూ డిప్లొమాటిక్ గానే ఆన్సర్ ఇచ్చేవాడు. అందరూ నాకు ఇష్టమైన హీరోయిన్ లే  అంటూ సింపుల్ గా నవ్వేసేవాడు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మహేష్ చెబుతూ... సమంతతో మంచి బాండింగ్ ఉందన్నాడు. సెట్ లో ఆమెతో సరదాగా ఉంటుందన్నారు. ఆ స్టేట్ మెంట్ చూసినవాళ్లంతా షాక్ అవుతున్నారు. సమంతకీ - మహేష్ కీ మధ్య బంధం అంత బలంగా ఉందా అని మాట్లాడుకొంటున్నారు. ఇక శ్రుతిహాసన్ ని మాత్రం తన ఫేవరేట్ హీరోయిన్ అని చెప్పేశాడు. ఇటీవలే శ్రుతి మహేష్ తో `శ్రీమంతుడు`లో నటించింది. ఆమె అందంతో మహేష్ కి పోటీనిచ్చింది. ఇద్దరి జోడీ అదుర్స్ అన్నారు.  శ్రుతి నటన కూడా అందరికీ నచ్చింది. మహేష్ కూడా శ్రుతి కనిపించిన విధానంపై చాలా సంతృప్తిగా ఉన్నాడు. అందుకే ఆమెని ఫేవరేట్ హీరోయిన్ అనేశాడు. హీరోయిన్లంతా మహేష్ మహేష్ అంటూ ఆయన్ని కలవరిస్తుంటారు. అలాంటి మహేష్ ఇప్పుడు ఇద్దరు హీరో్యిన్ల గురించి ఇంతగా పొగిడేశాడు. 

మహేష్ కి చెర్రీ ఒక్కడే!

మహేష్ కి చెర్రీ ఒక్కడే!
సినిమా ఎవరిదైనా కానివ్వండి. బాగుందంటే వెంటనే ట్విట్టర్ ద్వారా అభినందనలు చెబుతుంటాడు మహేష్. ఆఖరికి ట్రైలర్ నచ్చినా ఆయన స్పందిస్తుంటాడు. ఇటీవల `కంచె` సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చూసి వెంటనే ట్వీట్ చేశాడు మహేష్. అలాంటి ఓ సూపర్ స్టార్ నుంచి స్పందన వస్తే ఇక అంతకంటే కావల్సిందేముంటుందిఆ ట్వీట్ల గురించి చిత్రబృందం పదిమంది దగ్గర చెప్పుకొంటుంది. ప్రమోషన్లకు కూడా వాడుకొంటుంటారు. 


మహేష్ అయితే  అంతగా  ఎంకరేజ్ చేస్తాడు కదా? మరి ఆయన్నుంచి మంచి సినిమాలొస్తే పరిశ్రమ ఏ స్థాయిలో స్పందిస్తుంటుందిహీరోలు ఎవరైనా ఆయనకి విషెస్ చెబుతుంటారా? `శ్రీమంతుడు` రిలీజ్ అయ్యాక ఆ సినిమాని అభినందిస్తూ రామ్ చరణ్ మినహా మరెవ్వరూ మహేష్ కి ఫోన్ లు చేయలేదట. ఆ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు మహేష్. దీన్నిబట్టి చూస్తుంటే  చరణ్ మినహా మన హీరోలెవ్వరూ ఫ్రెండ్లీ కాంపీటేషన్ ను ఎంకరేజ్ చేయడం లేదేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. స్టార్ హీరోలు ఎవరైనా బిగ్ సక్సెస్ దక్కించుకున్నప్పుడు వారిని విష్ చేసే పద్ధతిని గతంలో మెగాస్టార్ చిరంజీవి బాగా ఫాలో అయ్యేవారు. ప్రస్తుతం అదే ఒరవడిని రామ్ చరణ్ కూడా కంటిన్యూ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి వంద కోట్ల క్లబ్ లో చేరిన శ్రీమంతుడుకి అభినందించిన రామ్ చరణ్... తన అప్ కమింగ్ మూవీ `బ్రూస్ లీ` వంద కోట్ల క్లబ్ లో చేరతాడేమో చూడాలి.
 
`బాహుబలి` తరువాత తెలుగులో వంద కోట్ల వసూళ్లు సాధించిన సినిమా `శ్రీమంతుడు`. అప్ కమింగ్ సినిమాలకు అదొక టార్గెట్ గా మారింది.  ఇండస్ట్రీలోని స్టార్ హీరోలంతా ఇప్పుడు `శ్రీమంతుడు` సాధించిన వంద కోట్ల రికార్డును బ్రేక్ చేయాలనే దానిపైనే దృష్టి పెడుతున్నారు. కొందరు స్టార్ డైరెక్టర్ లు సైతం... శ్రీమంతుడు కలెక్షన్ లను క్రాస్ చేసి తమ ఇమేజ్ ను పెంచుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎవరి ఆశలు ఎప్పుడు ఫలిస్తాయో చూడాలి. 

నానా.. నీకు నువ్వే సాటయ్యా!!!

నానా.. నీకు నువ్వే సాటయ్యా!!!
బాలీవుడ్ లో వేల కోట్ల ఆస్తులున్న వాళ్లున్నారు. ఒక్కో సినిమాకు వందల కోట్లు సంపాదించేవాళ్లున్నారు. కానీ వాళ్లెవరికీ మహారాష్ట్రలో రైతులు పిట్టల్లా రాలిపోతుంటే మనసు కరగలేదు. ఆ సంగతి పట్టింపే లేదు. సినిమా వాళ్లే కాదు మిగతా వాళ్లదీ అదే పరిస్థితి. ప్రభుత్వాలకే లెక్కలేనపుడు తమకేంటి అన్నట్లు ఎవరి పనుల్లో వాళ్లున్నారు. కానీ నానా పటేకర్ మాత్రం అందరిలా చూస్తూ ఊరుకోలేదు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు తన వంతు సాయం అందించాడు. వందకు పైగా కుటుంబాల్ని ఆదుకున్నాడు. రైతులు ఇంకెవరికైనా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వస్తే తన దగ్గరికి రండి.. ఆదుకుంటా అని స్టేట్ మెంట్ ఇవ్వడం ఆయనకే చెల్లింది. ఐతే నానా ఇదేదో పబ్లిసిటీ కోసం చేస్తున్న పనేమీ కాదు. ముందు నుంచి ఆయన చాలా కమిటెడ్.

వందల సినిమాల్లో నటించి కోట్ల రూపాయలు సంపాదించినా నానా పాతికేళ్లు చిన్న సింగిల్ బెడ్ రూం ఇంట్లో ఉంటున్న సంగతి చాలామందికి తెలియదు. అప్పట్లో సినీ కళాకారుల కోసం కట్టించి ఇచ్చిన ఇంట్లోనే ఆయనుంటున్నాడు. పారితోషకంగా తీసుకునే డబ్బులో చాలా వరకు సేవా కార్యక్రమాలకే వినియోగిస్తుంటాడాయన. ఎప్పుడూ లగ్జరీ కార్లను వాడింది లేదు. ఇప్పటికీ షూటింగ్ అంటే ఆటోలోనే వెళ్తారు. 30 ఏళ్లుగా ఆయనకిదే అలవాటు. సంజయ్ దత్ నేరస్థుడని కోర్టు ఖరారు చేసి.. జైలు శిక్ష విధించాక.. ఆయన పక్కన నేనెప్పటికీ నటించను అని ప్రకటించిన విలువలున్న మనిషి నానా.

శివసేన వ్యవస్థపాకుడైన దివంగత నేత బాల్ థాకరేకు నానా మిత్రుడు. కానీ ముంబై పేలుళ్ల సమయంలో హింసకు కారణమవుతున్నాడంటూ ఆయన తీరును వ్యతిరేకించాడు. ముంబైలో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్న ఆ సమయంలో రోడ్డు మీదికి వచ్చి ఆందోళనల్ని చల్లార్చే ప్రయత్నం చేశాడు నానా. చాలా పార్టీలు ఆయన్ని రాజకీయాల్లోకి రావాలని.. తమ పార్టీ నుంచి పోటీ చేయాలని అడిగినా ఒప్పుకోలేదు. నానా దర్శకుడిగా మారి.. తీసిన తొలి సినిమా ప్రహార్కోసం మూడేళ్లు మిలటరీ శిక్షణ తీసుకున్నాడు నానా. అతడి అంకిత భావాన్ని గుర్తించి ఆర్మీ కెప్టెన్ హోదా ఇచ్చారు. కార్గిల్ యుద్ధ సమయంలో స్వచ్ఛందంగా సేవ చేశాడు నానా. ఇదీ ఆయన చరిత్ర. 

రైతుల కోసం చాలా ఏళ్ల నుంచే గళం వినిపిస్తున్నాడు. తన వంతు సాయం చేస్తున్నాడు నానా. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండటానికే మీడియా ముందుకొచ్చి స్టేట్ మెంట్ ఇచ్చాడు నానా. ఇప్పటికి 100కు పైగా కుటుంబాలకు సాయం చేసిన నానా.. ఇంకో 800 కుటుంబాలకు సాయం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. తన దగ్గరున్న డబ్బంతా అయిపోయే వరకు అలా ఇవ్వడానికి సిద్ధమంటున్నాడాయన. నానా గొప్ప నటుడన్న సంగతి అందరికీ తెలుసు. ఆయన ఎంత గొప్ప వాడన్నది కూడా ఇప్పుడిప్పుడే జనాలకు తెలుస్తోంది. ఇలాంటి వాళ్లకు పాదాభివందనం చేయాల్సిందే!!!

నయా సింగర్ కి దిల్ రాజు ఆఫర్

నయా సింగర్ కి దిల్ రాజు ఆఫర్
గ్లామర్ - ఛరిష్మా లోకాన్ని ఏల్తున్నాయి. ఇవి రెండూ లేనిదే ఏ రంగంలోనూ ఛాన్సుల్లేని పరిస్థితి. అలాంటిది గ్లామర్ రంగంలో రాణించాలంటే వీటిని వెంట తెచ్చుకోవాల్సిందే మరి. ఇదిగో అదే గ్లామర్ ఓ సింగర్ కి ఏకంగా యాక్టర్ అయ్యే ఛాన్సిచ్చింది. టాలీవుడ్ కి చెందిన ఓ అగ్ర నిర్మాత ఓ సింగర్ ని లైవ్ లో చూసి మరీ నటించే చాన్సిస్తానని ప్రామిస్ చేశాడు.

అమ్మడు పాటతో మెప్పించిందాలేదా? అన్నది పక్కనబెడితే టాలీవుడ్ లో ఇదో సెన్సేషన్. ఓ లైవ్ గాయనిని పిలిచి మరీ హీరోయిన్ ని చేసేస్తానని నిర్మాత మాటిచ్చాడంటే అది చిన్న విషయమావింటున్నారా భామలూ? అసలు యాక్టింగు కోసం ఫోటోలు పట్టుకుని ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగడమే కాదు.. అప్పుడప్పుడు ఇలాంటి మ్యాజిక్ లు చేసి నిర్మాతల్ని మెప్పిస్తే మీ దశ తిరిగిపోవడానికి ఛాన్సుంది.  నిన్నటి రోజున ఓ ప్రముఖ టీవీ చానెల్ లో సూపర్ సింగర్స్ కాంటెస్టులో పాల్గొన్న దిల్రాజు నేరుగా లైవ్ లోనే ఓ గాయని గురించి ప్రస్థావిస్తూ ఈ అమ్మాయి నటించడానికి సిద్ధమైతే ఛాన్సులివ్వడానికి నేను రెడీ అనేశాడు.


అంతగా టెంప్ట్ చేసింది ఆ సందర్భంలో సింగింగ్ కానే కాదు. కేవలం ఛరిష్మా. గ్లామర్. అది ఉంటేనే ఇక్కడ మనుగడ. ఎలాంటి అవకాశం అయినా ఇంటికొస్తుంది. వర్థమాన తారలూ వింటున్నారామీరు కూడా ఇక నుంచి రాజుగారు వచ్చే లైవ్ కార్యక్రమాలకు అటెండ్ అయితే సరి. అక్కడ స్టేజీపై ఏదోలా కనిపించి ఆకట్టుకుంటే సరి. లక్కీ ఛాన్స్.. మీదే అవ్వొచ్చు. ట్రై యువర్ లక్.

26న బ్రూస్ లీ ఆడియో.. మెగాస్టారే గెస్ట్

26న బ్రూస్ లీ ఆడియో.. మెగాస్టారే గెస్ట్
రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న బ్రూస్ లీ .. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్. శ్రీనూ శైలికి భిన్నంగా తెరకెక్కుతున్న సినిమా ఇదన్న ప్రచారంతో మెగాభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. రొటీన్ శ్లాప్ స్టిక్ కామెడీలకు ఒక్క దెబ్బకి అల్లంత దూరాన ఎగిరిపడడాలు ఈ సినిమాలో ఉండవనే ఆశిస్తున్నారంతా. రొటీన్ కమర్షియల్ స్టఫ్ తో ఈ సినిమాని తీయడానికి చెర్రీ - చిరంజీవి వ్యతిరేకించారని .. ఇక చరణ్ ని కొత్తగా చూసే ఛాన్సుందని అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అంచనాల్ని చరణ్ నిజం చేస్తాడో లేదో తెలీదు కానీ ఇప్పటికైతే ఆడియో రిలీజ్ ఈనెల 26న అని ప్రకటించాడు. 

పాటలు వచ్చేస్తున్నాయ్. తమన్ మ్యూజిక్ వినేందుకు రెడీ కండి అని చెబుతున్నాడు. ఈ సినిమాలో చరణ్ తో కలిసి మెగాస్టార్ స్టెప్పులు కలిపారు... కాబట్టి ఆడియోపై అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. పాటల వేడుకలో చిరు డ్యాన్స్ మూవ్స్ వీడియో చూడాలన్న తహతహలో ఉన్నారంతా. ఇప్పటికే తమన్ అన్ని పాటల్ని కంపోజ్ చేసేశాడు. ఒకే ఒక్క పాట బ్యాలెన్స్. ఆడియో ఎలానూ వచ్చేస్తోంది. అయితే శ్రీనూ ఎలా మారాడో తమన్ కూడా అలానే మారిన మ్యూజిక్ డైరెక్టర్ అనిపిస్తాడేమో చూడాలి. ఏ.ఆర్.రెహమాన్ని మించి ఇన్నోవేటివ్ థాట్స్ తో కొత్త ట్యూన్ లు ఇస్తాడనే ఆశిద్దాం. ఈ ఆడియో విజయానికి తొలి మెట్టు. చెర్రీకి కిక్కిచ్చే ఆడియో వస్తుందాలేదా?   వెయిట్ అండ్ సీ.

అతిలోక సుందరిని కొట్టేశానంటోంది

అతిలోక సుందరిని కొట్టేశానంటోంది
కమల్ హాసన్ సరసన విశ్వరూపం ఫ్రాంఛైజీకి కమిటైంది ఎన్నారై గాళ్ పూజా కుమార్. ఇప్పటికే విశ్వరూపం 1 రిలీజై సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ ఈ అమ్మడు దక్షిణాది అంతటా తెలిసిపోయింది. ఇక కెరీర్ పరంగా పూర్తి బిజీ అయిపోతుందనే భావించారంతా. కానీ అనూహ్యంగా అవకాశాలే లేవ్. ఇటీవలే రిలీజైన ఉత్తమ విలన్ కూడా ఈ అమ్మడికి నిరాశనే మిగిల్చింది. ఈపాటికే విశ్వరూపం సీక్వెల్ లో నటించింది ఈ భామ. ఈ సిరీస్ లో రెండు సినిమాల్లోనూ తనే నాయిక .. కాబట్టి ఆ క్రేజు సౌత్ లో స్టార్ పెద్ద స్టార్ అయిపోవడానికి ఉపకరిస్తుందనే భావించింది. కానీ ఏం ప్రయోజనం? అస్సలు మన దర్శకనిర్మాతల కంటికి పూజా కుమార్ కనిపించనేలేదు. అయితే ఇలా రేసులో వెనకబడడానికి కారణం ఏంటో ఇంతకాలానికి తెలుసుకుంది అమ్మడు. 


తన బొద్దు దేహశిరులు చూసి ఎవరూ అవకాశం ఇవ్వడానికి ముందుకు రావడం లేదని నృత్యంలో ఎంత గొప్ప నర్తకిని అయినా నన్ను ఎవరూ గుర్తించలేదని తెలుసుకున్న ఈ అమ్మడు ఇటీవలి కాలంలో అధిక బరువు తగ్గి స్లిమ్మయిపోయింది. ఈ న్యూలుక్ లో అదిరిపోయిందంటూ రిపోర్ట్ వచ్చింది. సౌత్ ఆసియా ఫిలింఫెస్టివల్ లో అనూహ్యంగా కమల్ హాసన్ పరిచయమయ్యారు. ఆ టైమ్ లో విశ్వరూపం - ఉత్తమ విలన్ కథలు చెప్పారు. అయితే కేవలం కథలు చెబుతున్నారంతే అనుకున్నా. వాటిలో నేనే హీరోయిన్ అనుకోలేదు. కానీ విచిత్రంగా వరుసగా మూడు సినిమాలకు నేనే హీరోయిన్. శ్రీదేవి - గౌతమి - జయప్రద వంటి స్టార్లకు రాని అవకాశం. అతిలోక సుందరినే వరించని అవకాశం ఇది. వాళ్లే రెండేసి సినిమాల్లో మాత్రమే కమల్ తో ఛాన్స్ అందుకున్నారు. నేను లక్కీ. వాళ్లని మించిన అదృష్ట వంతురాలి.. అంటూ చెప్పింది. కమల్ నటించిన ఏక్ దుజే కేలియే అంటే చాలా ఇష్టమని పూజా కుమార్ చెప్పింది.

పట్టించుకోనని చెప్పిన మహేష్

పట్టించుకోనని చెప్పిన మహేష్
తన గురించి ఎవరేమన్నా పెద్దగా పట్టించుకోడు మహేష్. అలాంటి విషయాలపై డిస్కషన్ జరపడం కూడా వృథానే అన్న సంకేతాల్ని అభిమానులకి కూడా పంపుతుంటాడు. ఆమధ్య `1` సినిమా పోస్టర్ లపై సమంత చేసిన కామెంట్ల విషయంలోనూ అభిమానులు గరమ్ గరమ్ అయిపోయారు. కానీ మహేష్ మాత్రం ఆ పరిస్థితిని కూల్గా డీల్ చేశాడు. ఎవ్వరినీ నొప్పించకుండా తానూ నొచ్చుకోకుండా `సమంత ట్వీట్ చేయడానికి బదులు నాకు ఫోన్ చేసి చెప్పినా ఆ పోస్టర్ని తీయుంచేవాడిని` అని చెప్పుకొచ్చాడు మహేష్. ఆయన స్పందించిన విధానం చూసి  సమంత కామెంట్ ని ఎంకరేజ్ చేసిన మహిళా సంఘాలు కూడా ఒక్కసారిగా కూల్ అయిపోయాయి. 

ఇప్పుడు తేజ తనపై చేసిన కామెంట్ల విషయంలోనూ మహేష్ అదే తరహాలో స్పందించి అందరికీ షాక్నిచ్చాడు.  మహేష్ గురించీ - మహేష్ దత్తత పోగ్రాం గురించీ  తేజ ఘాటైన కామెంట్లు చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  ఊరి దత్తత అనేది టాక్సులు ఎగ్గొట్టడానికి ఎంచుకొన్న మార్గమని బహిరంగంగానే విమర్శించాడు. ఈ కామెంట్ లపై మహేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో స్పందించాడు. ''తేజ ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలీదు. ఆ మాటల్ని నేను పట్టించుకోను'' అంటూ లైట్ తీసుకొన్నాడు మహేష్. ఇక మళ్లీ ఆ కామెంట్లపై సీరియస్ గా స్పందించడం దానికి ప్రతిగా తేజ కూడా మీడియా ముందుకు వచ్చి ఎక్స్ పోజ్ అవ్వడం ఏదో ఒక మాట అనడం ఇవన్నీ అనవసరం అన్నట్టుగా మహేష్ అక్కడితో వివిదానికి పుల్ స్టాప్ పెట్టేశాడు.  నిజంగా ఎప్పుడు ఏ విషయంపై ఎలా స్పందించాలో మహేష్ కి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదేమో. అయితే మహేష్ స్పందన ఎలా ఉన్నా ఆయన అభిమానులు మాత్రం  తేజపై కాస్త గుర్రుగానే కనిపిస్తున్నారు. 

ఆ సినిమా చేయట్లేదు -మహేష్

ఆ సినిమా చేయట్లేదు -మహేష్
మహేష్ బాబు తేల్చిపడేశాడు. పక్క భాషలో వచ్చిన మూవీ ఎంత బాగున్నా ఏ రేంజ్ సక్సెస్ అయినా సరే.. రీమేక్ విషయంలో తన రూట్ మార్చుకోలేనని చెప్పాడు. తని ఒరువన్ ని తెలుగులో రీమేక్ లో మహేష్ బాబు చేయబోతున్నాడనే ప్రచారానికి ఇలా తెర దించేశాడు ప్రిన్స్. 

వేరే వాళ్లు అప్పటికే చేసిన కేరక్టర్ మళ్లీ చేయడానికి మనసొప్పదు. అందుకే రీమేక్స్ నాకు ఇష్టం ఉండవు. నేను చేయను.. ఇదీ రీమేక్స్ పై మహేష్ గతంలో ఇచ్చిన స్టేట్ మెంట్. ఇప్పుడు కూడా ఇదే మాటపై నిలబడ్డాడు శ్రీమంతుడు.  తని ఒరువన్ మూవీ బాగుందని బ్లాక్ బస్టర్ అని చెబ్తుండేసరికి.. తను కూడా చూశాడట మహేష్. రాజా డైరెక్షన్ బాగుందని తప్పకుండా అతనితో మూవీ చేస్తానని కానీ అది తని ఒరువన్ రీమేక్ కాదని చెప్పాడు 


మహేష్ బాబు - రామ్ చరణ్ - మహేష్ లలో ఎవరో ఒకరితో.. ఈ మూవీని తెలుగులో తనే తీయాలని భావిస్తున్న డైరెక్టర్ మోహన్ రాజాకు.. ఇప్పుడు చెర్రీ ఒకడే ఆప్షన్. ఇకపోతే ఇన్ కేస్ దర్శకుడు మోహన్ రాజా కనుక మాంచి కథతో వస్తే బైలింగువల్ సినిమా ఒకటి చేద్దాం అంటున్నాడు మహేష్. మరి చెర్రీతో రీమేకా? మహేష్ తో కొత్తదా

డైనమైట్.. ఇంత దారుణమా?

డైనమైట్.. ఇంత దారుణమా?
తెలుగు పరిశ్రమలో మంచు హీరోలకు తగిలిన ఎదురు దెబ్బలు అన్నీ ఇన్నీ కావు. విష్ణు - మనోజ్ కలిసి మోహన్ బాబుకు భారీ నష్టాలే మిగిల్చారు. ఐతే కెరీర్ ఆరంభంలో ఎదురైన  బ్యాడ్ ఫేజ్ ను దాటుకుని ఓ దశలో కుదురుకున్నట్లే కనిపించారు. ఇద్దరూ వరుసగా ఎంటర్ టైన్ మెంట్ బేస్డ్ మూవీస్ చేస్తూ ఓ మోస్తరు సక్సెస్ లతో సాగిపోయారు. ఐతే రెండు మూడు సక్సెస్ లు చూసేసరికి విష్ణులో కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. మళ్లీ పాత దారిలోకి వెళ్లిపోయాడు. యాక్షన్ సినిమాల బాట పట్టి.. వరుసగా ఎదురు దెబ్బలు తింటున్నాడు. గత ఏడాది రౌడీ - అనుక్షణం దారుణమైన ఫలితాలు చవిచూశాయి. సెంటిమెంటు సినిమా ఎర్రబస్సుఅయితే విష్ణు కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా డైనమైట్పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు.

తమిళంలో సూపర్ హిట్టయిన అరిమా నంబికిది రీమేక్. పైగా దేవా కట్టా లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తీశాడు. సినిమా బాలేదని కూడా చెప్పడానికేమీ లేదు. అయినా సినిమా దారుణమైన ఫలితం చూసింది. తొలి వారానికే సినిమా అడ్రస్ గల్లంతయింది. డైనమైట్కు పోటీగా విడుదలైన భలే భలే మగాడివోయ్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ రేంజికి చేరుకోగా.. డైనమైట్మాత్రం సోదిలో లేకుండా పోయింది. హైదరాబాద్ లో భలే భలే మగాడివోయ్ రెండో వీకెండ్ లో దాదాపు 50 థియేటర్ లలో హౌస్ ఫుల్స్ తో నడుస్తుంటే డైనమైట్ నాలుగు మల్టీప్లెక్సుల్లో ఒక్కో షో మాత్రమే ఆడుతోంది. కంటెంట్ ఉన్న సినిమానే అయినప్పటికీ.. విష్ణును యాక్షన్ మోడ్ లో చూడ్డానికి జనాలు ఇష్టపడలేదు. అతడి నుంచి ఎంటర్ టైన్ మెంటే ఆశిస్తున్నట్లున్నారు ప్రేక్షకులు. విష్ణు ఈ సంగతి అర్థం చేసుకుని తర్వాతి సినిమాల విషయంలో జాగ్రత్త పడితే మేలు.

మూడేండ్లలో రెట్టింపైన కుబేరులు

మూడేండ్లలో రెట్టింపైన కుబేరులు
న్యూఢిల్లీ: దేశంలో సంపన్నుల సంఖ్య శరవేగంగా పెరుగుతున్నది. గడిచిన మూడేండ్లలో సూపర్ రిచ్ లిస్ట్‌లో చేరిన ఇండియన్లు రెట్టింపయ్యారు. షాంఘైకి చెందిన లగ్జరీ పబ్లిషింగ్ కంపెనీ హురన్ తాజాగా విడుదల చేసిన శ్రీమంతుల జాబితా ప్రకారం.. జూలై 2015 చివరినాటికి మన దేశంలో 124 మంది డాలర్ బిలియనీర్లు (బిలియన్ డాలర్లంటే ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో రూ.6600 కోట్లు) ఉన్నారు. 2012లో కనీసం బిలియన్ డాలర్ల సంపద ఉన్న ఇండియన్లు 56 మందికాగా.. ఈ ఏడాదిలో ఆ సంఖ్య 120 ఎగువకు చేరుకుంది. 

-124కు చేరిన బిలియనీర్ల సంఖ్య
-296
కు పెరిగిన హై నెట్‌వర్త్ ఇండివిజువల్స్
-
మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న ముకేశ్
-
అత్యంత పిన్న వయస్కులైన
-
భారతీయ శ్రీమంతులుగా ఓలా వ్యవస్థాపకులు

అంతేకాదు హై నెట్‌వర్త్ ఇండివిజువల్స్(హెచ్‌ఎన్‌ఐ) 296 మంది ఉన్నారు. రూ.1600 కోట్ల కంటే అధిక సంపద కలిగిన వారిని ఈ జాబితాలో హెచ్‌ఎన్‌ఐలుగా పరిగణలోకి తీసుకున్నారు. శ్రీమంతుల సంఖ్య పెరిగినప్పటికీ వీరందరి ఆస్తి విలువ మాత్రం వార్షిక ప్రాతిపదికన 7 శాతం తగ్గిందని హురన్ ఇండియా హెడ్ అనస్ రహ్‌మాన్ జునైద్ వెల్లడించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 6 శాతం తగ్గడం ఇందుకు కారణమని ఆయన తెలిపారు. అయితే హెచ్‌ఎన్‌ఐల జాబితాలోని 13 మంది సంపద ఈ ఏడాదికాలంలో రెట్టింపు అయిందన్నారు.

హురన్ సంస్థ భారత కుబేరుల జాబితా విడుదల చేయడం ఇది నాలుగోసారి. ఈ ఏడాదికి విడుదల చేసిన జాబితాలోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీయే అగ్రస్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి రూ.1.61 లక్షల కోట్లుగా నమోదైందని, గత ఏడాదితో పోలిస్తే మాత్రం 3 శాతం తగ్గిందని హురన్ తెలిపింది. ఈ రిచ్ లిస్ట్‌లో సన్‌ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వీ రెండో స్థానంలో, ఎస్‌పీ హిందూజా మూడో స్థానంలో నిలిచారు. గత ఏడాది జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ఈసారి 7వ స్థానానికి పడిపోయారు.

ఆన్‌లైన్ ద్వారా కారు అద్దెకిచ్చే ఓలాక్యాబ్స్ వ్యవస్థాపకులు అంకిత్ భాటి(28 ఏండ్లు), భవిష్ అగర్వాల్ (29 ఏండ్లు).. భారత్‌లోని శ్రీమంతులందరిలోకెల్లా అత్యంత పిన్న వయస్కులని హురన్ వెల్లడించింది. రూ. 2,385 కోట్ల చొప్పున సంపద కలిగిన వీరద్దరికీ లిస్ట్‌లో 238వ స్థానం దక్కింది. ఇక మొత్తం 296మంది హెచ్‌ఎన్‌ఐలలో ఆరుగురు మహిళలకే చోటు లభించింది. రూ.19,179 కోట్ల ఆస్తితో బెన్నెట్ కోల్‌మన్‌కు చెందిన ఇందు జైన్.. ఈ జాబితాలో అత్యంత సంపన్నురాలుగా నిలిచారు. 
rich1

-
వీరి ఆర్జన.. రాకెట్టుకన్నా స్పీడు!
హురన్ కుబేర భారతీయుల జాబితాలోని కొందరి ఆస్తుల విలువ ఏడాదికాలంలో శరవేగంగా వృద్ధి చెందింది. బెంగళూరుకు చెందిన మ్యూసిగ్మా అనే డేటా అనలిటిక్స్ కంపెనీ అధినేత ధీరజ్ రాజారామ్ సంపద ఏడాది కాలంలో 593 శాతం పెరిగి రూ.17,800 కోట్లకు చేరుకుంది. ఇండియా బుల్స్‌కు చెందిన సమీర్ గెహ్లాట్ ఆస్తి 445 శాతం పుంజుకొని రూ.9,800 కోట్లకు ఎగబాకింది. వెల్‌స్పన్‌కు చెందిన బాలక్రిష్ణ గోయెంకా సంపాదన 308 శాతం వృద్ధి చెంది రూ.9,820 కోట్లుగా నమోదైంది. ఇక పీఎన్‌సీ ఇన్వెస్ట్ సంస్థకు చెందిన పీఎన్‌సీ మీనన్ ఆస్తి 279 శాతం పెరిగి రూ. 10,960 కోట్లకు చేరుకుంది. ఇక బ్రిటానియా సంస్థకు చెందిన నస్లీ వాడియా ఆర్జన 277 శాతం ఎగబాకి రూ.29,380 కోట్లుగా నమోదైంది.