కథను నమ్మి చేశాను!
కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమా కొరియర్ బాయ్ కళ్యాణ్. చాలా రోజుల నిరీక్షణ తరువాత ఫైనల్‌గా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది అన్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం కొరియర్ బాయ్ కళ్యాణ్. ప్రేమ్‌సాయి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యామీ గౌతమ్ కథానాయిక. గౌతమ్ వాసుదేవ్ మీనన్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. గురు ఫిలింస్, మల్టీడైమెన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో నితిన్ మాట్లాడుతూ కొరియర్ బాయ్ కళ్యాణ్ అంటే ట్విట్టర్‌లో ఒక అభిమాని కంటెంట్ బేస్డ్ కథ అని పెట్టాడు.
అతను చెప్పినట్టే కంటెంట్‌ను నమ్మి ఈ సినిమా చేశాను. ఇంతకుముందు ఈ తరహాలో కంటెట్‌ను నమ్ముకుని వచ్చిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి. ఓ సగటు మనిషికి ఓ సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కొన్నాడన్నది ఈ సినిమాలో చాలా కొత్తగా వుంటుంది. చాలా కొత్త పాయింట్‌తో చేసిన సినిమా ఇది. అది ఏంటనేది చాలా షాకింగ్‌కు గురిచేసేలా వుంటుంది. అనూప్ అందించిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది. ప్రేమ్‌సాయి మూడేళ్లు కష్టపడి ఈ సినిమా చేశాడు. నెగెటీవ్ ఆలోచనతో ఈ సినిమా చేశాను. అయితే చేశాక తెలిసింది. ఈ కథ విలువేంటో. ఇంత మంచి స్క్రిప్ట్‌ను నా దగ్గరికి పంపించిన దర్శకుడు గౌతమ్‌మీనన్‌కు కృతజ్ఞతలు. నాకు చాలా ముఖ్యమైన సినిమా ఇది. ఇమేజ్‌ను పక్కనపెట్టి ఈ సినిమా చేశాను. ఇలాంటి సినిమాలు సక్సెస్ అయితే మరిన్ని మంచి చిత్రాలొస్తాయి. అందుకే ఈ సినిమా విజయం పట్ల చాలా టెన్షన్‌తో ఎదురు చూస్తున్నాను.
కొత్త పంథాలో తీసిన సినిమా ఇది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకముంది అన్నారు. గౌతమ్‌మీనన్ మాట్లాడుతూ చాలా రోజులు తరువాత ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్ర విడుదలకు నితిన్ చక్కని సహకారం అందిస్తున్నారు. ఇదొక స్వీట్ స్టోరీ. చక్కటి కుటుంబ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. సెకెండ్ హాఫ్‌లో థ్రిల్లంగ్ లిమెంట్స్ వుంటాయి. తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకుట్టకుంటుందన్న నమ్మకముంది అన్నారు.
No comments:
Post a Comment