మగాడు అన్నారుగా.. ఇక 5 కోట్లు
యువహీరో నాని కెరీర్ ఆరంభంలో అదరగొట్టేశాడు. అష్టాచెమ్మా -
పిల్ల జమీందార్ - ఈగ వరుసగా హిట్ కొట్టి కుర్రాడి రేంజును పెంచాయి. అనంతరం అనూహ్య
పరాజయాలతో కెరీర్ పరంగా చతికిల పడిపోయాడు. ఆ సమయంలో ఒక్క హిట్ ప్లీజ్ అంటూ
తహతహలాడాడు. ఎవడే సుబ్రహ్మణ్యం రూపంలో ఓ యావరేజ్ తర్వత ఆశించిన కమర్షియల్ సక్సెస్
మారుతి రూపంలో ఇంటికొచ్చింది.
వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన భలే భలే మాగాడివోయ్ సినిమా
కమర్శియల్ గా మంచి విజయాన్ని సాధించింది.
దీంతో నాని దాహం తీరిపోయింది. కృష్ణవంశీ (పైసా) వంటి
సీనియర్ దర్శకుడు సైతం నాని కోసం రంగంలోకి దిగినా కాని పని మారుతి వల్ల అయ్యింది.
అయితే ఒక్క విజయంతో నాని మళ్లీ
పారితోషికాన్ని అమాంతం పెంచేశాడని అంటున్నారు. లక్షల్లో కెరీర్ ప్రారంభిచిన నాని
ఈసారి ఏకంగా కోట్లకు పడగెత్తాడట. భలే భలే మగాడివోయి సినిమాకు 1.5 కోట్ల వరకూ పారితోషికం ముట్టిందని
విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు సక్సెస్ రావడంతో 5 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నాడని ఫిలిం
సర్కిల్స్ లో వినిపిస్తోంది.
మొత్తానికి ఒక్క హిట్ ఎంత కిక్ ఇస్తుందో ఈ విషయం చూస్తే మనకు అర్ధమైపోతుంది. మగాడు అన్నారుగా.. ఆ మాత్రం డిమాండ్ చేయకపోతే ఎట్టా!!
మొత్తానికి ఒక్క హిట్ ఎంత కిక్ ఇస్తుందో ఈ విషయం చూస్తే మనకు అర్ధమైపోతుంది. మగాడు అన్నారుగా.. ఆ మాత్రం డిమాండ్ చేయకపోతే ఎట్టా!!
No comments:
Post a Comment