చైనా పటాకులకు అనుమతి లేదు
దిగుమతిదారులపై చర్యలు
తీసుకోండి..
-రాష్ర్టాలను కోరిన కేంద్ర వాణిజ్య మంత్రి సీతారామన్
చెన్నై, సెప్టెంబర్ 12: చైనా నుంచి పటాకులను దిగుమతి చేసుకునేందుకు కేంద్రం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఎవరైనా చైనా నుంచి పటాకులను దిగుమతి చేసుకుంటుంటే అది చట్ట విరుద్ధమే అవుతుందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలను ఆమె కోరారు.
చైనా నుంచి దిగుమతి వల్ల దేశీయ పటాకుల తయారీ ఇండస్ట్రీతోపాటు వీటిలో పనిచేసే 90 లక్షలకు పైగా సిబ్బందిపై తీవ్ర ప్రభావం పడుతున్నదని ఈనెల 4న సీతారామన్‌కు రాసిన లేఖలో పీఎంకే లీడర్ అంబుమణి రామదాస్ పేర్కొన్నారు. ఆట బొమ్మల పేరుతో గడిచిన ఆరేండ్లలో 600 కంటైనర్ల చైనా పటాకులు మన దేశంలోకి దిగుమతయ్యాయని ఆయన లేఖలో వెల్లడించారు. దేశీయ పటాకుల తయరీ ఇండస్ట్రీ రూ.6000 కోట్ల స్థాయికి చేరుకుంది. తమిళనాడులోని శివకాశి పటాకుల తయారీకి కేంద్ర బిందువు అన్న సంగతి తెలిసిందే. చైనా పటాకులతో పోటీపడలేక దేశంలో ఇప్పటికే చాలా వరకు చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి.

No comments:
Post a Comment