Monday, September 14, 2015

మంచు అమ్మాయి దేశభక్తి

మంచు అమ్మాయి దేశభక్తి
ఏ కార్యక్రమంలో పాల్గొన్నా సరే మంచు లక్ష్మి తన ప్రత్యేకతని ప్రదర్శిస్తుంటుంది. సహజంగానే ఆమెలో ఫ్యాషన్ నాలెడ్జ్ ఎక్కువ. తన కట్టుబొట్టూతో అందరినీ తనవైపు తిప్పుకొంటుంటుంది. అయితే ఎక్కడికి ఎలా వెళ్లాలో ఆమెకి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదేమో. సినిమా ఫంక్షన్లకి ఒకలా ఇతరత్రా ప్రయివేటు ఫంక్షన్ లకు మరొకలా ముస్తాబై వెళుతుంటుంది. అందుకే అలా నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఫ్యాషన్ గురించి మెలకువలు నేర్చుకోవాల్సిందే అని చెబుతుంటారు చాలామంది. ఇటీవల లక్ష్మీ ప్రసన్న ఒక ప్రభుత్వ  కార్యక్రమంలో పాల్గొంది. ఎంతోమంది ప్రముఖులు డిగ్నిటీ పర్సన్స్ హాజరయ్యే ఆ వేడుకకి లక్ష్మీ కూడా  ప్రత్యేకంగా ముస్తాబై వెళ్లింది. 


పుణ్యభూమి నా దేశం... అంటూ తన డ్రెస్ పై ప్రత్యేకంగా రాయించుకొని మరీ ఆ వేడుకకి వెళ్లింది.  దీంతో అక్కడ కూడా మంచు లక్ష్మీనే హైలెట్ అయ్యింది. ఆమె రాసుకొన్న మాటకి అర్థం ఏంటో అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేశారు.  `పుణ్యభూమి నా దేశం నమో నమామి...` అనే పాటని తెలుగువాళ్లు ఎప్పటికీ మరిచిపోలేరు. అన్న ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన  `మేజర్ చంద్రకాంత్`లోని పాట అది. ఆ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మరోసారి అధికారంలోకి రావడానికి కారణమైన చిత్రమిదే అని మోహన్ బాబు చెబుతుంటారు. ఆ చిత్రంలోని చరణాన్ని తన గౌనుపై రాయించుకొని దేశంపై తనకున్న భక్తినీ మమకారాన్నీ చాటిచెప్పింది. 

లక్ష్మీ ప్రసన్న ఇటీవల తెలంగాణ రాష్ట్రం తరఫున స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. అలా వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన బ్రాండ్ అంబాసిడర్ లకు ఇటీవల ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన లక్ష్మీప్రసన్న ఇలా తన గౌనుపై `పుణ్యభూమి నా దేశం... ` అని రాసుకొని వెళ్లిందన్నమాట. తెలంగాణ రాష్ట్రాన్ని మురికిలేని స్వచ్ఛమైన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని లక్ష్మీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. 

No comments:

Post a Comment