Monday, September 14, 2015

భయపెట్టే కాకి..

భయపెట్టే కాకి..
అశోక్‌కుమార్, కిరణ్ పత్తికొండ, మేఘాశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ద్విభాషా చిత్రం కాకి. సౌండ్ ఆఫ్ వార్నింగ్ అని ఉపశీర్షిక. మనోన్.యమ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కిరణ్ పత్తికొండ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పత్తికొండ కుమార స్వామి మాట్లాడుతూ నా కుమారుడు పత్తికొండ కిరణ్ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాతో అతను నటుడిగా నిరూపించుకుంటాడు అని తెలిపారు. తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించిన నాకు తెలుగులో ఇదే తొలి చిత్రం అని అశోక్‌కుమార్ అన్నారు.

మేఘాశ్రీ మాట్లాడుతూ నటనకు ఆస్కారమున్న పాత్రలో నటిస్తున్నాను. సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కామెడీతో సాగే సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ చిత్రమిది అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ 45 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. అయితే ఇందులో 10 రోజులు మాత్రం కథ డిమాండ్ మేరకు నిరవధికంగా 24 గంటలు షూటింగ్ చేయడం జరిగింది. హారర్ కథకు థ్రిల్లర్ అంశాల్ని జోడించి ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రాన్ని దర్శకుడు రూపొందించడం జరిగింది. ప్రస్తుతం నేపథ్య సంగీతానికి సంబంధించిన వర్క్ జరుగుతోంది. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఓ బంగ్లా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. అందులో జరిగే వింతలు, వాటి వెనకున్న రహస్య మేమిటి? అన్నది సినిమాలో చూడాల్సిందే అన్నారు.

No comments:

Post a Comment