Monday, September 14, 2015

దక్ష ఫ్యూచర్ లక్షణమేనా?!

దక్ష ఫ్యూచర్ లక్షణమేనా?!

తేజ సినిమా అయితే హిట్టు - లేదంటే ఫట్టు. అయితే ఆయన సినిమాల్లో యాక్టర్స్  మాత్రం దాదాపుగానే హిట్టవుతుంటారు. అందుకే తేజ స్కూల్ నుంచి వచ్చిన తారలు చాలా మందే కనిపిస్తారు. కాజల్ - నితిన్ లాంటి స్టార్స్ మొదలు కమెడియన్ లు - క్యారెక్టర్ ఆర్టిస్టులు  ఇలా  ఆ జాబితాలో బోలెడంత మంది కనిపిస్తారు. తన సినిమాలతోనే వాళ్లని పర్ ఫెక్ట్ నటీనటులుగా తీర్చిదిద్ది పంపుతుంటాడు తేజ. దీంతో ఇక ఏ దర్శకుడితో సినిమా చేసినా తిరుగేలేదన్నట్టుగా దూసుకెళుతుంటారు. ఇటీవల `హోరా హోరీ`తోనూ బోలెడుమంది కొత్త నటీనటుల్ని తెరకు పరిచయం చేశాడు. సినిమా రిజల్ట్ మైనస్ గానే ఉన్నా... అందులోని ఒకరిద్దరు నటులు మాత్రం బాగా ఆకట్టుకొన్నారు. ముఖ్యంగా కథానాయిక దక్ష. ఆమెని తెరపై చూసినవాళ్లంతా దక్ష  భవిష్యత్తు తెలుగులో లక్షణంగా ఉండబోతోందని మాట్లాడుకోవడం ఇండస్ట్రీలో కనిపించింది. సినిమాలో దక్షకి చెప్పుకోదగ్గ స్థాయిలో నటించే అవకాశం లేకపోయినా ఆమె ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయనీ -  ముఖ్యంగా ఆమె స్మైల్ - ఫిజిక్ హైలెట్ అని విశ్లేషకులు తేల్చారు. కమర్షియల్ తెలుగు సినిమా కథానాయికకి కావల్సిన లక్షణాలన్నీ దక్షలో ఉన్నాయి కాబట్టి వెంటనే ఆమె బుక్కపోవడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
తెలుగులో కథానాయికల కొరత చాలా ఉంది. కానీ ఇటీవల ఒక్కో సినిమాలో ఇద్దరు ముగ్గురు కథానాయికలు ఉండాల్సిన పరిస్థితి. ఈ దశలో ఏ అందం ఓ మాదిరిగా ఆకట్టుకొన్నా సరే వాళ్లను పిలిచి మరీ అవకాశాలిచ్చేస్తున్నారు. దక్ష అందంగా కనిపించడంతో పాటు.. తెలుగు నేర్చేసుకొని డబ్బింగ్ కూడా చెప్పేసింది. ఇలాంటి హీరోయిన్ లని ఇండస్ట్రీ అస్సలు వదులుకోదు. కాజల్ నటించిన `లక్ష్మీకళ్యాణం` కూడా ఓ మాదిరిగానే ఆడింది. కానీ ఫ్లాప్ సినిమా హీరోయిన్ అని ఆమెని పక్కనపెట్టలేదు. క్రేజీ ఆఫర్ లు ఇచ్చి ప్రోత్సహించారు. ఆ రకంగా దక్ష కూడా తెలుగు ఇండస్ట్రీకి దక్కిన మరో కాజల్ అన్న టాక్ బయటికొచ్చింది. `హోరా హోరీ` ఒక రెండు మూడు వారాల ముందు విడుదలయ్యుంటే కచ్చితంగా ఆమె నాగచైతన్య నితిన్ ల సినిమాల్లో అవకాశాలు దక్కేవని చెబుతున్నారు పలువురు నిర్మాతలు. 

No comments:

Post a Comment