మహేష్ కి
చెర్రీ ఒక్కడే!
సినిమా ఎవరిదైనా కానివ్వండి. బాగుందంటే
వెంటనే ట్విట్టర్ ద్వారా అభినందనలు చెబుతుంటాడు మహేష్. ఆఖరికి ట్రైలర్ నచ్చినా ఆయన
స్పందిస్తుంటాడు. ఇటీవల `కంచె` సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చూసి వెంటనే ట్వీట్ చేశాడు
మహేష్. అలాంటి ఓ సూపర్ స్టార్ నుంచి స్పందన వస్తే ఇక అంతకంటే కావల్సిందేముంటుంది? ఆ
ట్వీట్ల గురించి చిత్రబృందం పదిమంది దగ్గర చెప్పుకొంటుంది. ప్రమోషన్లకు కూడా వాడుకొంటుంటారు.
మహేష్ అయితే అంతగా ఎంకరేజ్ చేస్తాడు కదా? మరి ఆయన్నుంచి మంచి సినిమాలొస్తే పరిశ్రమ ఏ స్థాయిలో స్పందిస్తుంటుంది? హీరోలు ఎవరైనా ఆయనకి విషెస్ చెబుతుంటారా? `శ్రీమంతుడు` రిలీజ్ అయ్యాక ఆ సినిమాని అభినందిస్తూ రామ్ చరణ్ మినహా మరెవ్వరూ మహేష్ కి ఫోన్ లు చేయలేదట. ఆ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు మహేష్. దీన్నిబట్టి చూస్తుంటే చరణ్ మినహా మన హీరోలెవ్వరూ ఫ్రెండ్లీ కాంపీటేషన్ ను ఎంకరేజ్ చేయడం లేదేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. స్టార్ హీరోలు ఎవరైనా బిగ్ సక్సెస్ దక్కించుకున్నప్పుడు వారిని విష్ చేసే పద్ధతిని గతంలో మెగాస్టార్ చిరంజీవి బాగా ఫాలో అయ్యేవారు. ప్రస్తుతం అదే ఒరవడిని రామ్ చరణ్ కూడా కంటిన్యూ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి వంద కోట్ల క్లబ్ లో చేరిన శ్రీమంతుడుకి అభినందించిన రామ్ చరణ్... తన అప్ కమింగ్ మూవీ `బ్రూస్ లీ` వంద కోట్ల క్లబ్ లో చేరతాడేమో చూడాలి.
`బాహుబలి` తరువాత తెలుగులో వంద కోట్ల వసూళ్లు సాధించిన సినిమా `శ్రీమంతుడు`. అప్ కమింగ్ సినిమాలకు అదొక టార్గెట్ గా మారింది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలంతా ఇప్పుడు `శ్రీమంతుడు` సాధించిన వంద కోట్ల రికార్డును బ్రేక్ చేయాలనే దానిపైనే దృష్టి పెడుతున్నారు. కొందరు స్టార్ డైరెక్టర్ లు సైతం... శ్రీమంతుడు కలెక్షన్ లను క్రాస్ చేసి తమ ఇమేజ్ ను పెంచుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎవరి ఆశలు ఎప్పుడు ఫలిస్తాయో చూడాలి.
No comments:
Post a Comment