Monday, September 14, 2015

కమల్ అతణ్ని వదలట్లేదు.

కమల్ అతణ్ని వదలట్లేదు.
కమల్ హాసన్ అంతే మరి.. ఎవరైనా నచ్చారంటే అంత ఈజీగా వదలరు. తనకు సౌకర్యంగా అనిపించే వాళ్లతో మళ్లీ మళ్లీ పని చేయడానికి ఇష్టపడతారు. అది నటీనటులైనా సరే.. దర్శకులైనా సరే. తన దగ్గర ఏడేళ్లుగా అసిస్టెంటుగా పని చేస్తున్న రాజేష్ ఎం. సెల్వ అనే కుర్రాడికి చీకటి రాజ్యంసినిమాతో దర్శకుడిగా కమల్ అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. ఓ ఫ్రెంచ్ సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. తొలి సినిమాలో రాజేశ్ పనితనం నచ్చడంతో అతడికి మరో అవకాశమివ్వాలని భావిస్తున్నాడు కమల్.

ఒకప్పుడు కమల్ తో బ్రహ్మచారిలాంటి బంపర్ కామెడీ సినిమా తీసిన మౌళి ఈ మధ్య కమల్ కు మంచి కామెడీ కథాంశం చెప్పారట. అది పంచతంత్రం - భామనే సత్యభామనే - బ్రహ్మచారి తరహాలోనే ఆద్యంతం నవ్వులు పంచే కథ అట. ఐతే మౌళి డైరెక్షన్ చేసే పరిస్థితుల్లో లేరు కాబట్టి.. రాజేశ్ దర్శకత్వంలో ఆ సినిమా చేయాలనుకుంటున్నాడట కమల్. చీకటి రాజ్యం విడుదలైన వెంటనే ఈ సినిమా మొదలవుతుందని సమాచారం. ఉత్తమ విలన్సినిమాతో దారుణంగా నష్టపోయిన లింగుస్వామికి మళ్లీ ఓ సినిమా చేస్తానని అప్పట్లో ఒప్పుకున్నాడు కమల్. ఆ మాట ఈ సినిమాతో నిలబెట్టుకుంటాడట. ఐతే తన అసిస్టెంట్ లను దర్శకులుగా పెట్టి సినిమా తీసినపుడు అది దాదాపుగా కమల్ సినిమానే అనుకోవాలి. తన క్రియేటివిటీ హద్దులు దాటిపోకుండా చూసుకోవడానికి.. షూటింగ్ వ్యవహారాల్లో ఆయనకు కొంత తలనొప్పి తగ్గించడానికే డైరెక్టర్ అవసరమవుతాడు.

No comments:

Post a Comment