Sunday, September 13, 2015

యదగిరి గుట్టలో పెరిగిన భక్తుల రద్దీ

యదగిరి గుట్టలో పెరిగిన భక్తుల రద్దీ


యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉదయం 4 గంటలకే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి.
4
గంటలకు సుప్రభాతం,
4.30
గంటలకు తిరువారాధన,
5
గంటలకు బాలభోగం,
5.30
గంటలకు గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం,
ఉద యం 6.15గంటలకు తులసీఅర్చన,
7
గంటల నుంచి ఉభయ దర్శనాలు మొదలవుతాయి.
8.30
గంటలకు నిత్యకల్యాణం,
మధ్యాహ్నం 12గంటలకు నివేదన,
సాయంత్రం 5గంటలకు నిత్యాలంకర తిరువీధి సేవ,
రాత్రి 7 గంటలకు ఆరాధన, 7.30గంటలకు తులసీకుంకుమార్చనలు,
ఆంజనేయస్వామి వారికి సహస్రనామార్చనలు, 9గంటలకు ఆరగింపు, 9.45 గంటలకు శయనోత్సవం జరుగుతాయి. కొండపైన గల శ్రీ పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం 5గంటలకు నుంచి రాత్రి 8గంటలకు వరకు పూజలు కొనసాగుతాయి.

పాతగుట్ట గుడిలో...
పాతగుట్ట ఆలయంలో నిత్యపూజలు యధావిధిగా కొనసాగుతాయి.
ఉదయం 5గంటలకు సుప్రభాతం,
5.45
గంటలకు బిందె తీర్థం,
6.15
గంటలకు ఆరాధన,
ఉదయం 7గంటల నుంచి 8గంటల వరకు దైవదర్శనాలు,
8
గంటలకు అభిషేకం,
8.30
గంటలకు అర్చన,
మధ్యాహ్నం 12గంటలకు ఆరగింపు,
ఉదయం 9.30గంటలకు,
11
గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు కొనసాగుతాయి. సాయంత్రం 5.30 గంటలకు అలంకార సేవలు, రాత్రి 7.30 గంటలకు నివేదన, 8గంటలకు ఆలయ బంధనం జరుగుతుంది.
-
యాదగిరిగుట్ట, నమస్తే తెలంగాణ

No comments:

Post a Comment