మూడేండ్లలో 20 లక్షల కోట్లకు..!
ముంబై: దేశీయ మ్యూచువల్ ఫండ్
ఇండస్ట్రీ ఆస్తుల విలువ వచ్చే మూడేండ్లలో రూ.20 లక్షల కోట్లకు చేరుకోవచ్చని ఈవై (గతంలో
ఎర్నెస్ట్ అండ్ యంగ్), కేఫ్‌మ్యూచువల్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన నివేదిక అంచనా
వేస్తున్నది. ప్రస్తుతం ఇండస్ట్రీ నిర్వహిస్తున్న ఆస్తుల (ఏయూఎం) విలువ రూ.12 లక్షల కోట్లుగా
ఉంది. స్థూల ఆర్థికాంశాలు బలపడటంతోపాటు రాజకీయ పరిస్థితులు సానుకూలంగా మారనున్న
నేపథ్యంలో మార్కెట్లు భారీగా పుంజుకోనుండటం ఇందుకు దోహదపడనుందని రిపోర్టు
పేర్కొంది. 2008 నుంచి దేశంలో మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ఏటేటా 16.84 శాతం చొప్పున
సమ్మిళిత వృద్ధిని సాధించింది.
గ్లోబల్ మ్యూచువల్ ఇండస్ట్రీ సరాసరి వృద్ధి మాత్రం 8.80 శాతంగా ఉంది. దేశ జనాభాలో యువత వాటా పెరుగుతున్న నేపథ్యంలో మున్ముందు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరగవచ్చని ఈవై, కేఫేమ్యూచువల్ రిపోర్టు అభిప్రాయపడింది. దేశ ప్రజల్లో పొదుపు రేటు జీడీపీలో 30.6 శాతంగా ఉన్నప్పటికీ.. మ్యూచువల్ ఫండ్లలోకి వచ్చే సేవింగ్స్ వాటా మాత్రం 7 శాతంగానే ఉందని ఈవై భాగస్వామి మురళీ బలరాం అన్నారు. చాలా మంది ఏమాత్రం నష్టపోయే ప్రమాదం లేని పథకాలను కోరుకుంటుండటంతోపాటు ఆర్థిక అక్షరాస్యత తక్కువగా ఉండటం ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment