భల్లాలదేవ వినోదం
విమల్, బిందుమాధవి జంటగా నటించిన ఓ తమిళ చిత్రాన్ని భల్లాలదేవ పేరుతో రావిపాటి సత్యనారాయణ తెలుగులో అందిస్తున్నారు. ఎలిళ్ దర్శకుడు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రం దేసింగు రాజా పేరుతో తమిళంలో రూపొంది అక్కడ అనూహ్య విజయాన్ని సాధించింది. వినోదప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది. సెన్సార్ వారి నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన చిత్రమిది. కథానుగుణంగా చిత్రానికి భల్లాలదేవ అనే టైటిల్ పెట్టాం. కట్టప్ప అనే పాత్ర ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది అన్నారు.
No comments:
Post a Comment