Monday, September 14, 2015

డైనమైట్.. ఇంత దారుణమా?

డైనమైట్.. ఇంత దారుణమా?
తెలుగు పరిశ్రమలో మంచు హీరోలకు తగిలిన ఎదురు దెబ్బలు అన్నీ ఇన్నీ కావు. విష్ణు - మనోజ్ కలిసి మోహన్ బాబుకు భారీ నష్టాలే మిగిల్చారు. ఐతే కెరీర్ ఆరంభంలో ఎదురైన  బ్యాడ్ ఫేజ్ ను దాటుకుని ఓ దశలో కుదురుకున్నట్లే కనిపించారు. ఇద్దరూ వరుసగా ఎంటర్ టైన్ మెంట్ బేస్డ్ మూవీస్ చేస్తూ ఓ మోస్తరు సక్సెస్ లతో సాగిపోయారు. ఐతే రెండు మూడు సక్సెస్ లు చూసేసరికి విష్ణులో కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. మళ్లీ పాత దారిలోకి వెళ్లిపోయాడు. యాక్షన్ సినిమాల బాట పట్టి.. వరుసగా ఎదురు దెబ్బలు తింటున్నాడు. గత ఏడాది రౌడీ - అనుక్షణం దారుణమైన ఫలితాలు చవిచూశాయి. సెంటిమెంటు సినిమా ఎర్రబస్సుఅయితే విష్ణు కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా డైనమైట్పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు.

తమిళంలో సూపర్ హిట్టయిన అరిమా నంబికిది రీమేక్. పైగా దేవా కట్టా లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తీశాడు. సినిమా బాలేదని కూడా చెప్పడానికేమీ లేదు. అయినా సినిమా దారుణమైన ఫలితం చూసింది. తొలి వారానికే సినిమా అడ్రస్ గల్లంతయింది. డైనమైట్కు పోటీగా విడుదలైన భలే భలే మగాడివోయ్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ రేంజికి చేరుకోగా.. డైనమైట్మాత్రం సోదిలో లేకుండా పోయింది. హైదరాబాద్ లో భలే భలే మగాడివోయ్ రెండో వీకెండ్ లో దాదాపు 50 థియేటర్ లలో హౌస్ ఫుల్స్ తో నడుస్తుంటే డైనమైట్ నాలుగు మల్టీప్లెక్సుల్లో ఒక్కో షో మాత్రమే ఆడుతోంది. కంటెంట్ ఉన్న సినిమానే అయినప్పటికీ.. విష్ణును యాక్షన్ మోడ్ లో చూడ్డానికి జనాలు ఇష్టపడలేదు. అతడి నుంచి ఎంటర్ టైన్ మెంటే ఆశిస్తున్నట్లున్నారు ప్రేక్షకులు. విష్ణు ఈ సంగతి అర్థం చేసుకుని తర్వాతి సినిమాల విషయంలో జాగ్రత్త పడితే మేలు.

No comments:

Post a Comment