Monday, September 14, 2015

రానాతో సమంత.. భలే ఉందే!!

రానాతో సమంత.. భలే ఉందే!!
సమంత ఈ రోజు ట్విట్టర్ లో ఓ చిత్రమైన ఫొటో పోస్ట్ చేసింది. అందులో ఓ అబ్బాయి అమ్మాయి ఉన్నారు. వాళ్లు ముందుకు నడుస్తుండగా వెనుక నుంచి తీసిన ఫొటో అది. పొడవుగా బలంగా భారీగా ఉన్న ఆ అబ్బాయి మీదికి పొట్టిగా - నాజూగ్గా ఉన్న అమ్మాయి వాలిపోతూ ముచ్చట్లు చెబుతూ సాగిపోతోంది. దానికి ‘‘ప్రేమ అన్ని షేపుల్లో సైజుల్లోనూ ఉంటుంది’’ అంటూ కామెంట్ పెట్టింది సమంత. దీనికి బెంగళూరుడు డేస్ రీమేక్అనే ట్యాగ్ కూడా జత చేసింది.

ఇక ఫొటోలో ఉన్నదెవరో చెప్పేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ భారీకాయుడు రానా దగ్గుబాటి అయితే.. పక్కనున్న అమ్మాయి సమంత అన్నమాట. వీళ్లిద్దరినీ జంటగా చూపించడం సాహసమే. బొమ్మరిల్లు భాస్కర్ ఆ ప్రయత్నమే చేస్తున్నాడు. బెంగళూరు డేస్ రీమేక్ లో రానా పాత్రకు పెళ్లికి ముందే ఓ అఫైర్ ఉంటుంది. ఆ అఫైర్ తాలూకు ఫ్లాష్ బ్యాక్ ఓ పది నిమిషాలుంటుంది. ఆ పది నిమిషాల్లో కనిపించే పాత్రే సమంతది. ఈ పాత్ర ఏమవుతుందన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

మలయాళంలో ఈ పాత్రను నిత్య మీనన్ చేయడం విశేషం. బెంగళూరు డేస్ తమిళ వెర్షన్ కు అర్జున్ దివ్య మట్రుమ్ కార్తీక్అని పేరు పెట్టారు. షార్ట్ కట్ లో ఏడీఎంకే అన్నమాట. ఐతే ఇది అన్నాడేఎంకే పార్టీ పేరుకు దగ్గరగా ఉందని గొడవ కూడా జరిగింది. అయినా నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ తగ్గలేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments:

Post a Comment