శ్రీమతికి ఓ బహుమతి..
నాగార్జున, అమల దంపతుల్ని చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటూ మురిసిపోతారు అభిమానులు. అంతులేని ప్రేమాభిమానాలకు అందమైన చిరునామాగా వారిద్దరిని అభివర్ణిస్తారు. ఇదిలావుండగా శనివారం అమల పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా తన ప్రియమైన సతీమణికి ట్విట్టర్ ద్వారా ఓ పాటను బహుమతిగా అందజేశారు నాగ్. వివరాల్లోకి వెళితే...సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ సంస్థలు నిర్మల కాన్వెంట్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలోని ఒక్కోసారి ఓ ముద్దు...ఒక్కోచోట ఓ ముద్దు...ఒక్కోలాగా ఓ ముద్దు... అనే పాటను అమలకు బహుమతిగా ఇస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు నాగార్జున.
No comments:
Post a Comment