నయా సింగర్
కి దిల్ రాజు ఆఫర్
గ్లామర్ - ఛరిష్మా లోకాన్ని
ఏల్తున్నాయి. ఇవి రెండూ లేనిదే ఏ రంగంలోనూ ఛాన్సుల్లేని పరిస్థితి. అలాంటిది
గ్లామర్ రంగంలో రాణించాలంటే వీటిని వెంట తెచ్చుకోవాల్సిందే మరి. ఇదిగో అదే గ్లామర్
ఓ సింగర్ కి ఏకంగా యాక్టర్ అయ్యే ఛాన్సిచ్చింది. టాలీవుడ్ కి చెందిన ఓ అగ్ర
నిర్మాత ఓ సింగర్ ని లైవ్ లో చూసి మరీ నటించే చాన్సిస్తానని ప్రామిస్ చేశాడు.
అమ్మడు పాటతో మెప్పించిందా? లేదా? అన్నది పక్కనబెడితే టాలీవుడ్ లో ఇదో సెన్సేషన్. ఓ లైవ్ గాయనిని పిలిచి మరీ హీరోయిన్ ని చేసేస్తానని నిర్మాత మాటిచ్చాడంటే అది చిన్న విషయమా? వింటున్నారా భామలూ? అసలు యాక్టింగు కోసం ఫోటోలు పట్టుకుని ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగడమే కాదు.. అప్పుడప్పుడు ఇలాంటి మ్యాజిక్ లు చేసి నిర్మాతల్ని మెప్పిస్తే మీ దశ తిరిగిపోవడానికి ఛాన్సుంది. నిన్నటి రోజున ఓ ప్రముఖ టీవీ చానెల్ లో సూపర్ సింగర్స్ కాంటెస్టులో పాల్గొన్న దిల్రాజు నేరుగా లైవ్ లోనే ఓ గాయని గురించి ప్రస్థావిస్తూ ఈ అమ్మాయి నటించడానికి సిద్ధమైతే ఛాన్సులివ్వడానికి నేను రెడీ అనేశాడు.

అంతగా టెంప్ట్ చేసింది ఆ సందర్భంలో సింగింగ్ కానే కాదు. కేవలం ఛరిష్మా. గ్లామర్. అది ఉంటేనే ఇక్కడ మనుగడ. ఎలాంటి అవకాశం అయినా ఇంటికొస్తుంది. వర్థమాన తారలూ వింటున్నారా? మీరు కూడా ఇక నుంచి రాజుగారు వచ్చే లైవ్ కార్యక్రమాలకు అటెండ్ అయితే సరి. అక్కడ స్టేజీపై ఏదోలా కనిపించి ఆకట్టుకుంటే సరి. లక్కీ ఛాన్స్.. మీదే అవ్వొచ్చు. ట్రై యువర్ లక్.
No comments:
Post a Comment