ఫేస్‌బుక్ హెడ్‌క్వార్టర్స్‌కు ప్రధాని
మోడీ
న్యూఢిల్లీ: ఫేస్‌బుక్
ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని మోడీ సందర్శించనున్నారు. అమెరికా పర్యటన నేపధ్యంలో ఈ
నెల 27న మోడీ అక్కడికి వెళ్తారు. తమ కార్యాలయానికి
వస్తున్నట్లు స్వయంగా ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా
వెల్లడించారు. ఆ రోజు ఉదయం అక్కడి టౌన్‌హాల్‌లో జరిగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్
కార్యక్రమంలో పాల్గొంటారు. తమ సొంత కార్యాలయంలో మోడీని కలుస్తున్నందుకు ఎంతో
సంతోషంగా ఉందని జుకర్‌బర్గ్ చెప్పారు. ఈ సందర్భంగా మోడీతో తను కలిసి దిగిన ఫొటోను
జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
No comments:
Post a Comment