సరికొత్త స్క్రీన్‌ప్లేతో...!
రష్మీగౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం చారుశీల. శ్రీనివాస్
ఉయ్యూరు దర్శకుడు. జ్యోత్స్న ఫిలింస్ పతాకంపై జయశ్రీ అప్పారావు నిర్మిస్తున్న ఈ
చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పూజాకార్యక్రమాల అనంతరం దేవుని పటాలపై
చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో గౌతమ్ క్లాప్ నిచ్చారు. ఇదే రోజు
సుమన్ సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్ మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాత
మాట్లాడుతూ ఓ వినూత్మ కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.
భారతీయ సినీ చరిత్రలో ఇంత వరకు ఎవరూ అనుసరించని సరికొత్త స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా ఉండబోతోంది. ఈ నెల 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో హైదరాబాద్, అరకు వంటి ప్రదేశాల్లో పాటలతో సహా చిత్రాన్ని పూర్తిచేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. జశ్వంత్, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కుమార్ మల్లారపు, ఎడిటింగ్: నాగిరెడ్డి, సంగీతం: సుమన్, ఛాయాగ్రహణం: శ్రీనివాసరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: శ్రీనివాస్ ఉయ్యూరు.

No comments:
Post a Comment