పట్టించుకోనని
చెప్పిన మహేష్
తన గురించి ఎవరేమన్నా పెద్దగా పట్టించుకోడు మహేష్. అలాంటి
విషయాలపై డిస్కషన్ జరపడం కూడా వృథానే అన్న సంకేతాల్ని అభిమానులకి కూడా
పంపుతుంటాడు. ఆమధ్య `1` సినిమా పోస్టర్ లపై సమంత చేసిన కామెంట్ల
విషయంలోనూ అభిమానులు గరమ్ గరమ్ అయిపోయారు. కానీ మహేష్ మాత్రం ఆ పరిస్థితిని కూల్గా
డీల్ చేశాడు. ఎవ్వరినీ నొప్పించకుండా తానూ నొచ్చుకోకుండా `సమంత ట్వీట్ చేయడానికి బదులు నాకు ఫోన్
చేసి చెప్పినా ఆ పోస్టర్ని తీయుంచేవాడిని` అని
చెప్పుకొచ్చాడు మహేష్. ఆయన స్పందించిన విధానం చూసి సమంత
కామెంట్ ని ఎంకరేజ్ చేసిన మహిళా సంఘాలు కూడా ఒక్కసారిగా కూల్ అయిపోయాయి.
ఇప్పుడు తేజ తనపై చేసిన కామెంట్ల విషయంలోనూ మహేష్ అదే తరహాలో స్పందించి అందరికీ షాక్నిచ్చాడు. మహేష్ గురించీ - మహేష్ దత్తత పోగ్రాం గురించీ తేజ ఘాటైన కామెంట్లు చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఊరి దత్తత అనేది టాక్సులు ఎగ్గొట్టడానికి ఎంచుకొన్న మార్గమని బహిరంగంగానే విమర్శించాడు. ఈ కామెంట్ లపై మహేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో స్పందించాడు. ''తేజ ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలీదు. ఆ మాటల్ని నేను పట్టించుకోను'' అంటూ లైట్ తీసుకొన్నాడు మహేష్. ఇక మళ్లీ ఆ కామెంట్లపై సీరియస్ గా స్పందించడం దానికి ప్రతిగా తేజ కూడా మీడియా ముందుకు వచ్చి ఎక్స్ పోజ్ అవ్వడం ఏదో ఒక మాట అనడం ఇవన్నీ అనవసరం అన్నట్టుగా మహేష్ అక్కడితో వివిదానికి పుల్ స్టాప్ పెట్టేశాడు. నిజంగా ఎప్పుడు ఏ విషయంపై ఎలా స్పందించాలో మహేష్ కి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదేమో. అయితే మహేష్ స్పందన ఎలా ఉన్నా ఆయన అభిమానులు మాత్రం తేజపై కాస్త గుర్రుగానే కనిపిస్తున్నారు.

No comments:
Post a Comment