Monday, September 14, 2015

వర్మ ముఖచిత్రంతో ప్రత్యేక కథనం

వర్మ ముఖచిత్రంతో ప్రత్యేక కథనం
రామ్ గోపాల్ వర్మ మనసు పెట్టి సినిమా చేశాడంటే హిట్  కొట్టడం పక్కా. ఇటీవలే రిలీజైన 26 / 11 ముంబై ఎటాక్స్ ఆ సంగతిని నిరూపించింది. అతడు వాస్తవ సంఘటనలు తెరపై అద్భుతంగా చూపించగలడు. అందుకే  ఎన్ని ప్లాపులు ఎదురైనా వర్మ క్రేజు తగ్గనే లేదు. టెక్నాలజీ గురువులు  వర్మను అప్పుడప్పుడు ఇండియన్ జేమ్స్ కామరూన్ అంటూ పిలుస్తుంటారు.  శివ నుంచి అనుక్షణం వరకూ ఎన్నో వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీసిన మహా మేధావి వర్మ అని పొగిడేస్తుంటారు.

రామూ  ప్రస్తుతం స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథను కిల్లింగ్ వీరప్పన్ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం దక్షిణాదిన అన్ని ఇండస్ర్టీలు ఎంతో ఆసక్తిగా ఎదుచు చూస్తున్నాయి. ఎందుకంటే వీరప్పన్ దక్షిణాది రాష్ర్టాల పోలీసులను దశాబ్ధాల పాటు  ముచ్చెమటలు పట్టించాడు. గంధపు చెక్కల్ని తరలిస్తూ పట్టుబడకుండా క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడాడు. అందుకే కిల్లింగ్ వీరప్పన్ ప్రాజెక్టుపై కన్నడలో భారీ అంచనాలున్నాయి. అందుకే శాండల్ వుడ్ లో వర్మ పేరు మార్మోగిపోతోంది. 

కిల్లింగ్ వీరప్పన్ గురించిన ప్రత్యేక కథనాన్ని రాంగోపాల్ వర్మ ముఖ చిత్రంతో "విజయ నెక్స్ట్" అనే ఓ కన్నడ టాప్ మ్యాగజైన్ ప్రచురించింది. ఈ మధ్యకాలంలో ఓ దర్శకుడి ముఖచిత్రంతో ఓ మ్యాగజైన్ ఇలా కవర్ స్టోరీ రాయడం ఇదే తొలిసారని మ్యాగజైన్ సంబంధిత వర్గాల నుంచి తెలుస్తోంది. దీంతో దక్షిణాదిన ఆర్జీవీ క్రేజు కన్నడ పరిశ్రమలో రెట్టింపు అవుతోందని చెబుతున్నారు. బాలీవుడ్ నేలాడు టాలీవుడ్ ని ఏలాడు. ఇప్పుడు శాండాల్ వుడ్ ని ఏలడానికి వెళుతున్నాడన్నమాట!

No comments:

Post a Comment